Governor Tamilisai: కేసీఆర్ వస్తామన్నారు.. రాలేదు.. ఎందుకో తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి రాజ్‌భవన్‌కు దూరంగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అయితే, ఇవాళ వస్తున్నారంటూ ముందుగా సమాచారం ఇచ్చి.. చెప్పకుండానే దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలు హాజరు కాకపోవడం చర్చగా మారింది..
Read Also: Road Accident: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
కాగా, 2020లో నిర్వహించిన ఎట్ హోమ్‌కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.. గత ఏడాది కరోనా కారణంగా.. ఎట్ హోమ్ నిర్వహించలేదు.. ఈ రోజు మాత్రం రాత్రి 7 గంటల సమయంలో ఆయన రాజ్‌భవన్‌కు వస్తారని ముందుగా సమాచారం ఇచ్చారట.. సీఎం వస్తున్నారని.. చాలా సేపు గవర్నర్.. కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వేచిచూశారు.. ఇక, వచ్చేలా లేరని భావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. కేసీఆర్ హాజరు కాకపోవడంపై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. రాత్రి 7 గంటల సమయంలో సీఎం కేసీఆర్.. రాజ్‌భవన్‌కు వస్తారని ప్రగతి భవన్ నుంచి రాజ్‌భవన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ, ఎందుకు రాలేదో నాకు తెలియలేదు అన్నారు గవర్నర్.. కనీసం రావడం లేదన్న సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోతోందన్న ప్రచారం ఎప్పటి నుంచో జరగుతూనే ఉంది.. ఇక, మధ్యలో ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రత్యక్షంగా.. పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు గవర్నర్.. కానీ, గత జూన్ నెలలోనే ఫుల్‌స్టాప్ పడింది. తొమ్మిది నెలలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్.. హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించుకున్నారు.. ఇక అంతా సర్దుకుందా అనే చర్చ సాగుతోన్న సమయంలోనే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాకపోవచ్చని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేంద్ర రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతోనే కేసీఆర్ పదే పదే ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారా.. అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ అవకాశం లేదు అని చెప్పుకొచ్చారు తమిళిసై.. ఇదే సమయంలో కేసీఆర్ ఎప్పుడూ నా సోదరుడే. నేను ఎప్పడూ ఆయనకు సోదరినే అని కూడా కామెంట్ చేశారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ కేసీఆర్ రాజ్‌భవన్‌కు వస్తారని ముందు సమాచారం ఇచ్చినా.. రాకపోవడంతో.. మళ్లీ రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరుగుతుందా అనే చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?