Botsa Satyanarayana: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరం అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
YS Jagan: మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థులు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం పాలనలో నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. అయినా వాళ్లకు కనికరం కూడా లేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన…
Sub-Registrar Office : హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ఊహించని పరిణామంతో వార్తల్లో నిలిచింది. అధికారుల నిర్లక్ష్యం, ఆర్థిక అశ్రద్ధకు పరాకాష్టగా, ఏకంగా 40 నెలల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో కార్యాలయ భవన యజమాని తాళం వేయాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే, గత 40 నెలలుగా (సుమారు మూడున్నర సంవత్సరాలు)…
Harish Rao: పాశమైలారం పరిశ్రమ పేలుడు ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నేడు జరిగిన పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు హరీష్ రావుతో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రావు కలిసి పటాన్ చెరులోని ధ్రువ ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించారు. Read Also:Reactor…
Paddy Procurement : నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు పండించిన బంగారం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ధాన్యం రాశులు కళ్లెదుటే క్షీణిస్తుంటే రైతుల గుండెలు మాత్రం ఆందోళనతో కొట్టుకుంటున్నాయి. దీనికి కారణం లారీల కొరత.. ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోయాయి. రోజుల తరబడి రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీని వెనుక అసలు కథ వేరే ఉంది..…
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి…
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇసుక మేటలు పెట్టారు.. అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు మునుగుతున్నాయి.