KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖను కూడా అందిపుచ్చుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, రాష్ట్ర మంత్రులు కేవలం కంటి తుడుపు చర్యలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ప్రతిసారి పక్కదారి పట్టించే ప్రయత్నమే చేశారని ఆరోపించారు.
ENG vs IND: ‘ఒక్క ఛాన్స్’ ప్లేయర్ ఔట్.. నాలుగో టెస్ట్ భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
“పిల్లలు కలిగిన ఒక తండ్రిగా అడుగుతున్నా… కనీసం ఒక తండ్రిగా అయినా సీఎం స్పందించాలి,” అంటూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. “మీ పిల్లలకు ప్రభుత్వం విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటారా?” అంటూ ప్రశ్నించారు.
ఇన్ని దారుణ ఘటనలు జరుగుతున్నా, ఇప్పటికీ బాధ్యత ఎవరిది అనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే, ఇప్పుడు కూడా ఎవరు బాధ్యులు? ఎవరిని ఉరితీయాలో చెప్పాలి,” అంటూ కేటీఆర్ విమర్శల ధాటిని కొనసాగించారు.
రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
Naga Vamsi : విజయ్ దేవరకొండను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు