తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, సీఎం నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇసుక మేటలు పెట్టారు.. అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో బ్యాక్ వాటర్ వల్ల వేల ఎకరాల పంటలు మునుగుతున్నాయి.. కడెం ప్రాజెక్టు గేట్లు పెంచాలని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే ఇప్పటికీ వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఈటల అన్నారు. ఎప్పుడు వర్షం వస్తే కడెం ప్రాజెక్టు కింద గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతలో పెట్టుకొని జీవిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jasprit Bumrah: మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్న బూమ్ బూమ్ బుమ్రా.. వీడియో ఇదిగో
పంట నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ ఆ పరిహారం పూర్తిస్థాయిలో రాలేదు అని ఈటల రాజేందర్ అన్నారు. అధికార యంత్రాంగాన్ని ముందుగా మోహరించలేదు.. మీకు చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి చెప్పితే మోహరించేవారు కదా అని ఆయన చెప్పారు. ఈసారి ఫస్ట్ టైం మనుషులు కూడా కొట్టుక పోయారు..
ఓకే కుటుంబానికి చెందిన 7మంది ప్రాణాలు కోల్పోయారు.. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మంత్రులు పర్యటించినా వారి చేతిలో ఏం లేదు అని ఈటల రాజేందర్ అన్నారు.
Read Also: సామజవరగమన సినిమాలో నరేష్ టీషర్టుల మీద ఈ కొటేషన్స్ చూస్తే నవ్వాపుకోలేరు
సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు. తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. చెక్ డ్యాం నిర్మాణం చేసిన సంతోషం లేదు.. సదర్ మాట్ కాల్వకు గండి పడి వేల ఎకరాలు నీట మునిగాయి.. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామం మునక మానవ తప్పిదమే అని ఈటల రాజేందర్ తెలిపారు. చెరువులు తెగుతాయని ముందుస్తు సమాచారం గ్రామస్తులకు తెలిపితే అంత దు:ఖం ఉండక పోయేది అని ఆయన అన్నారు. నీరో చక్రవర్తిలా కాకుండా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి బరోసా కల్పించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.