హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. చెరువులు,నాళాలు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్ లోని స్థలాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కబ్జాదారుల నుంచి వందల కోట్ల విలువైన భూములను రక్షిస్తుంది హైడ్రా. ఈ క్రమంలో శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన నిర్మాణాలతో పాటు ప్రహరీ గోడను తొలగించింది. 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా బోర్డు…
వైసీపీ ఐదేళ్ల పాలనలో వేల ఎకరాలు భూదందా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్న మయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకే పల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు
Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 2002లో సర్వే నంబర్ 530లో…
Highcourt Telangana : హైదరాబాద్ అంబర్ పేట్‌లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు బతుకమ్మ కుంటను ప్రభుత్వమిదేనని స్పష్టం చేసింది. ఈ స్థలాన్ని తమదని, బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలకు స్టే విధించమని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు 2025 జనవరి 7వ తేదీన తుది తీర్పు ఇచ్చింది. Squid Game Viral Video: ‘స్క్విడ్‌గేమ్’లో టాలీవుడ్ స్టార్…
హైడ్రా కమిషనర్‌కు అమీన్‌పూర్ బాధితుల ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసిన అమీన్‌పూర్ బాధితులు.. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని మోసపోయామంటూ ఫిర్యాదు చేశారు.
Land Grab : రాయదుర్గం లో భారీ భూ దందా వెలుగులోకి వచ్చింది. 1500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ కొట్టేసిన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గ్రీక్ బిల్డర్స్ తో కలిసి.. ప్రభుత్వ ఆస్తిని కాజేశాడు సదరు అధికారి.. ప్రైవేట్ వ్యక్తులకు సహకరించి సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించారు. కాజేసిన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్, హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది గ్రీక్ బిల్డర్స్. రెవెన్యూ అధికారుల చొరవతో…
Government Land Auction:ఆదాయం సమకూర్చునేందుకు అన్వేషణ మొదలు పెట్టింది తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములను వేలం వేసి ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్లాట్లను వేలం వేయాలని HMDA నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడ, గండిపేటలోని 366 సర్వే నెంబర్లో ఉన్న 41 వేల 971 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు విక్రయానికి…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం…