Government Land Encroached: వైసీపీ ఐదేళ్ల పాలనలో వేల ఎకరాలు భూదందా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్న మయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకే పల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె మండలం బీకే పల్లె సర్వే నంబర్ 552లోని భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు. ఈ సర్వే నంబర్‌లో 10.05 ఎకరాలు ఉండగా.. అందులో ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి సర్వే నంబర్ 552-7లో 3.40 ఎకరాలు, సర్వే నంబర్ 552-8లో 0.50 ఎకరాలను పెద్ది రెడ్డి భార్య స్వర్ణలత పేరుతో కొనుగోలు చేశారు. ఇందులో బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్‌కు 18 సెంట్లు పోగా అదే 552-7కు ఆనుకుని ఉన్న 552-1 పార్టులో వున్న చెక్ డ్యామ్ ను పూడ్చివేసి 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కబ్జా చేసి చేసినట్టు తేల్చామంటున్నారు..
Read Also: India Pakistan Conflict: పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!
ఈ భూమి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి జిల్లాలకు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశాల మేరకు ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ ధనంజయులు ఆధ్వర్యంలో సోమవారం మండల సర్వేయర్ రెడ్డి శేఖర్ బాబు, ఆర్ఐ భరత్‌రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నంబర్ 552లోని పదెకరాలకు సరిహద్దులు నిర్ణయించారు. ఇందులో పెద్దిరెడ్డి భార్య పేరున ఉన్న భూమికి ఆనుకుని నంబర్ 552-1లో ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ప్రభుత్వ భూమికి వేసిన ఫెన్సింగ్‌ను తీసేసి.. తొలగించిన సిమెంట్ స్తంభాలు తొలగించారు. ఆ 1.35 ఎకరాలను కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుని ట్రెంచ్ కొట్టి.. హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశామని తహసీల్దార్ చెప్పారు.