Minister Satya Kumar: నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ఆసుపత్రికి ఆరు డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డా సంరక్షణకు పెద్ద పీట వేస్తుంది. ఈనేపథ్యంలో సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది.
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసింది. డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని ఏపీ ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులకు శుభవార్త చెప్పింది… మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు, రెసిడెంట్ స్పెషలిస్టులకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ వైద్యారోగ్యశాఖ… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం… సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ. 70 వేలు , రెసిడెంట్ డెంటిస్టులకు రూ. 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు రూ. 85 వేల మేర వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది……
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది సర్కార్.. మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఆ కష్టాలకు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. త్వరలోనే వ్యాక్సిన్ కష్టాలు తీరిపోనున్నాయి.. మరోవైపు.. కరోనా బాధితుల చికిత్స కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధాన్ని ఇప్పటికే విడుదల చేసింది కేంద్రం… ఇక, ఇవాళ పొడి రూపంలో ఉండే 2-డీజీ ఔషధం ధరను ఫిక్స్ చేశారు.. ఈ ఔషధం…
కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.. దీంతో.. ఆస్పత్రుల్లో బెడ్స్ లేని పరిస్థితి వచ్చింది.. ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఇబ్బంది పెడుతుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ బెడ్ల కొరతపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని ఎక్కువ బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతుండడంతో.. అసలు ఉన్న బెడ్లు…