Satyakumar: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శానిటేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఎక్విప్మెంట్, డయాలసిస్ కేంద్రాలు లాంటి వాటిపై ఆడిటింగ్ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన వైద్యారోగ్య శాఖలోని నాడు-నేడు పనుల పైనా ఆడిటింగ్ చేయబోతున్నాం.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల మెరుగైన పని తీరు కోసం 30 అంశాల కార్యాచరణ చేపడుతున్నాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సానుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. సరైన నిర్వహణ, పారిశుధ్యం, అవాంతరాలు లేని ఓపీ సేవలు, హాజరుపై దృష్టి పెట్టాలి అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.
Read Also: Brahma Anandam: ‘బ్రహ్మ ఆనందం’ వస్తున్నాడు చూశారా?
ఇక, వైద్యులు, రోగ నిర్ధారణ పరికరాలు, యంత్రాల పని తీరును పర్యవేక్షిస్తామని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో అందుబాటులో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలి అని ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.. మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు స్వల్ప, మధ్య , దీర్ఘకాలిక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య మంత్రిత్వ శాఖ పాత 11 అనుబంధ బోధన ఆస్పత్రులతో పాటు కొత్త వాటితో సహా అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత మరియు పని తీరులో మార్పు కోసం ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించింది అని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.