ఏపీలో 5 ప్రభుత్వ వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసియు విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో యూనిట్ కు రూ. 23 కోట్ల 75 లక్షల చొప్పున మొత్తం రూ. 118 కోట్ల 75 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Also Read:AP: ఏపీలో 5 ప్రభుత్వ వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరు..
ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు:
1.రాయచోటి ఏరియా ఆసుపత్రి (అన్నమయ్య జిల్లా)
2.చీరాల ఏరియా ఆసుపత్రి (బాపట్ల జిల్లా)
3.పాలకొండ ఏరియా ఆసుపత్రి (పార్వతీపురం మన్యం జిల్లా)
4.భీమవరం ఏరియా ఆసుపత్రి (పశ్చిమ గోదావరి జిల్లా)
5.రంగరాయ మెడికల్ కళాశాల, (కాకినాడ జిల్లా)