మంచి తరుణం మించిన దొరకదు….సందు దొరికింది బిస్తరేసేద్దామనుకున్నారు. కాకితో కబురు పంపితే చాలు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో వాలిపోయేవారు. మాజీ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేని టైం చూసి…ఇక జెండా పాతేద్దామనుకున్నటైంలో సీన్స్ రివర్స్ అయిపోయిడీప్‌గా హర్టయ్యారట ఆ మాజీ ఎంపీ. ఎవరా మాజీ? పిలవని పేరంటాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. మితృత్వాలు, శతృత్వాలతో పాటు సీట్లకు కూడా గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల…
Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు వివాదాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. ఒక్కోసారి... అవే పాపులర్ చేస్తాయి. ఇంకోసారి ఎత్తి అగాధంలోకి పడేస్తాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఈ రెండూ జరిగిపోయాయి. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన మాధవ్.... 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే... ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడం చకచకగా జరిగిపోయాయి.
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఇక మాధవ్ సహా…
Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక, బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల విడుదలయ్యే అవకాశం ఉంది.
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణ మొదలయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను…
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. Also Read: Pawan Kalyan: ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేస్తోంది: పవన్ కల్యాణ్ టీడీపీ నేత…
Gorantla Madhav : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 23, 24వ తేదీల్లో మాధవ్ ను విచారించేందుకు గుంటూరు నగర పోలీసులకు పర్మిషన్ ఇస్తూ కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. కానీ కోర్టు రెండు రోజులకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గోరంట్ల మాధవ్. 23న మాధవ్ ను నగరం పాలెం…
ఆ మాజీ ఎంపీ హాఫ్ బాయిల్డ్ పాలిటిక్స్ చేస్తున్నారా? తన ఓవరాక్షన్‌తో మొత్తంగా పార్టీనే ఇరుకున పెట్టేశారా? ఆయన అతి కారణంగా….. ఎఫెన్స్‌లో ఉండాల్సిన చోట వైసీపీ డిఫెన్స్‌లోకి పడిపోయిందా? ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన చోట సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయిందా? ఎవరా ఎంపీ? ఎలా ఇరుకున పెట్టారు పార్టీని? ఒక్కసారి ఎంపీ మీదికి మీసం మెలేసి ఓవర్ నైట్‌లో పాపులర్ అయిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్. ఆ దూకుడు చూసే…. వైసీపీ అధ్యక్షుడు జగన్…
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్, అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి…