Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. జగన్ భద్రతను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కొంతమంది పోలీసులు ప్రభుత్వ పెద్దలకు చెంచాలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఏకంగా ఒక వ్యక్తిని జగన్ తన కారుతో గుద్దించి చంపించారని కేసు నమోదు చేయించారు.. మరీ చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని చంపించినట్టు ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని అడిగారు. అమరావతి కుంభకోణం, రింగ్ రోడ్డు స్కాం, అసైన్డు భూముల స్కాం, ఫైబర్ నెట్ స్కాం.. ఇలా అనేక కేసులు చంద్రబాబు మీద ఉన్నాయని గోరంట్ల మాధవ్ అన్నారు.
Read Also: Honda Shine 100 DX: స్టైల్, మైలేజ్, సేఫ్టీల పక్కా ప్యాకేజీతో వచ్చేసిన కొత్త షైన్ 100 DX బైక్.!
అయితే, ఆపద్దర్మ సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ సంస్థకు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారని మాజీ ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. స్కిల్ కేసులో జైలు జీవితం అనుభవించిన వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ని ఇబ్బంది పెట్టటానికి లేని మద్యం స్కాంని తెరమీదకు తెచ్చారు.. జనంలో జగన్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే వేధింపులకు దిగారు.. చంద్రబాబు, లోకేష్ ల పాలన క్లైమాక్స్ కు చేరింది.. చెడు సంప్రదాయాలకు దిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.. ప్రజలే తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని గుర్తుంచుకోవాలని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.