వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్, అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read:Tragedy : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కార్పెంటైన్ ఆయిల్ తాగి 21 నెలల చిన్నారి మృతి
మొత్తం వ్యవహారంపై నివేదిక తెప్పించుకున్న ఉన్నతాధికారులు ఎస్.బి. డీఎస్పీ సీతారామయ్యను వీఆర్ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. మాధవ్ కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు బందోబస్తులో ఉన్న 11మంది పోలీసులను సస్పెండ్ చేశారు. అరండల్ పేట సీఐ వీరాస్వామి, నగరంపాలెం, పట్టాభిపురం ఎస్సైలు రాంబాబు,రామాంజనేయులు, మరో ఎనిమిది మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.