‘గాడ్ ఫాదర్’ ప్రపంచవ్యాప్తంగా సినీఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న టైటిల్ ఇది. ఇప్పుడు ఈ టైటిల్ తో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా వస్తోంది. ఆ చిత్రంలో ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి ఫస్ట్ లుక్ ను సోమవారం సాయంత్రం 5.45 గంటలకు విడుదల చేశారు. “Black is not bad; Black is always beautiful” అనేవారు ఎందరో ఉన్నారు. సినీజనం సైతం ‘బ్లాక్ కలర్’కు జైకొడుతూ ఫంక్షన్స్ కు, పార్టీలకు బ్లాక్ కలర్…
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్‌ఫాడర్’ ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేసింది. ఇందులో చిరు ఇచ్చే మాస్ ఎంట్రీకి రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతుండగా.. వారి మధ్య నుంచి బ్లాక్ కలర్ కారు…
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఓ బయోపిక్ తీస్తే బాగుంటుందని ఒక వేదికపై సీనియర్ నటుడు బెనర్జీ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌కి బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు బయోపిక్‌పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. చిరు బయోపిక్ తాను తీస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’కి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. గతేడాదిలో సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు…
‘మదర్స్ డే’ని పురష్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి భూమ్మీద ఉండే అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తన తల్లి అంజనా దేవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేశారు. గతంలో ఓసారి గాడ్‌ఫాదర్, భీమ్లా నాయక్ చిత్రీకరణలు ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో అంజనా దేవి, నాగబాబు లొకేషన్‌కు చేరుకొని.. సెట్‌లో కాసేపు గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. చూడ్డానికి ఎంతో చూడమచ్చటగా ఉండే ఈ వీడియోను అందరినీ…
Godfather విషయంలో ఇప్పటి వరకూ ప్రచారమైన రూమర్స్ ను నిజం చేస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. Godfather అనే ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కన్పించబోతున్నారని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలే చిరు… సల్మాన్ ను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి “గాడ్ ఫాదర్” షూటింగ్‌లో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “భీమ్లా నాయక్” సెట్‌ను సందర్శించి, తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న…
మెగాస్టార్ చిరంజీవి లైన్ లో పెట్టిన ఆసక్తికర చిత్రాల్లో “గాడ్ ఫాదర్” ఒకటి. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ మూవీ “లూసిఫర్” అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందుతోంది “గాడ్ ఫాదర్”. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చిరు ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్…
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ను తమన్ ఇదివరకే ప్రారంభించగా, తదుపరి ట్యూన్ అంశాలపై చర్చించారు. తాజాగా…