గోదావరికి వరద పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరుగ్రామం లో ఉన్నటువంటి శ్రీ మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం మెట్ల వద్దకు చేరుకుంది గోదావరి. దేవాలయం దగ్గర దుకాణాలు మునిగిపోయాయి. క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టంతో లంక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. దేవీపట్నం వద్ద గండిపోశమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
దీంతో గండిపోశమ్మ ఆలయానికి భక్తుల రాక నిలిపివేశారు అధికారులు. ఇటు వరద పోటుతో కూనవరం వద్ద పెరిగింది గోదావరి నీటిమట్టం. గోదావరికి వరదపై అప్రమత్తమైంది అధికార యంత్రాంగం. మహారాష్ట్రలో అధిక వర్షాల నేపథ్యంలో వరద హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ మాధవీలత. ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. 55 వేల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.
గోదావరి ఉగ్రరూపం.. నీట మునిగిన దుకాణాలు