తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగునీరు చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా దేవీపట్నం నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. పోలవరంలో ముంపునకు గురవుతున్న పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.