Bhadrachalam: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 24 అడుగుల వద్ద చేరుకొని ఉంది.. ఇది మరి కొంత పెరిగే అవకాశం కనబడుతుంది.మరోవైపున తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకి భారీ ఎత్తున నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగు తుండటంతో ప్రస్తుతం 43 అడుగులకి చేరింది .దీంతో గత రాత్రి కిన్నెరసాని గేట్లని ఎత్తారు అదేవిధంగా తాలి పేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటిమట్టం రావటంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి విడుదల చేశారు.
Read also: Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం
ఇకపోతే నిన్న అశ్వరావుపేట వద్ద 16 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఇటీవల కాలంలో ఇక్కడ ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదు భారీ వర్షం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. పెదవాగు ప్రాజెక్టు నిండిపోయింది పెదవాగు ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీళ్లు చేరాయి. దీంతో మూడు గేట్లని పూర్తిగా వదిలినప్పటికీ బండు మీద నుంచి నేటి ప్రవాహం జరిగింది. ఇకపోతే పెదవాగు ప్రాజెక్ట్ పక్కనే ఉన్న నారాయణపురం వాగు పొంగింది. నారాయణపురం వాగులో అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో 50 మంది చిక్కుకొనిపోయారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సమాచారం అందించడం తో స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారులతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాలు రెండు హెలికాప్టర్ ని సంఘటన స్థలానికి పంపించారు. హెలికాప్టర్ ద్వారా 26 మందిని అదేవిధంగా ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఎయిర్ బొట్ల ల ద్వారా 25 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా పెదవాగు ప్రాజెక్టుకి మూడు చోట్ల స్వల్పంగా గండిపడింది. అయితే గత రాత్రి నుంచి వర్ష ప్రభావం తగ్గటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ముందస్తు నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు తరలించారు.
Hyderabad: మైనర్ బాలికపై అత్యాచారం.. 24 ఏళ్ల యువకుడిని అరెస్టు..