2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే... ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ. అయినా సరే.... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్ లీడర్స్. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా... మిగతా నియోజకవర్గాల నేతలంతా... స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు…
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు కీలకం. గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్‌గా కూటమికి పట్టం కట్టింది.. ఫలితాలలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. రెండు జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. గత ఎన్నికల్లో టిడిపి 22, జనసేన 11 స్థానాల్లో, బిజెపి ఒక చోట పోటీ చేసి గెలిచాయి. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 సీట్లలో పోటీ చేస్తే అందులో 11 ఉమ్మడి ఉభయ గోదావరి…
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
బర్డ్ ప్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
కోళ్లకు అంతుచిక్కని వ్యాధిపై గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలకు ఈ వ్యాధి లేకపోయినా కొన్నిచోట్ల జాడ కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ కోళ్లకు వ్యాపించడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనలో ఉన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల నిర్వహణపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహారిస్తూ ఫుల్ జోష్ నింపారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి విజయం సాధించారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపి మూర్తి.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్టుగా చెబుతున్నారు..
నేడు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.. ఉదయం 8 గంటలకు అంటే కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. ఈనెల 21 వరకు ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే.