Glenn Maxwell: పూటుగా తాగి ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్.. దర్యాప్తుకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Maxwell under investigation by CA: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా అడిలైడ్‌లో రాత్రిపూట పూటుగా మద్యం సేవించిన మాక్స్‌వెల్.. అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీరియస్ అయ్యింది. మాక్స్‌వెల్‌ను దర్యాప్తుకు రావాలని సీఏ ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై సీఏ విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలుస్తోంది.
బీబీఎల్ 2024లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకు గ్లెన్ మాక్స్‌వెల్ నాయకత్వం వహించాడు. టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన మెల్‌బోర్న్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆపై జనవరి 19న రాత్రి అడిలైడ్‌లో ‘సిక్స్ అండ్ అవుట్’ బ్యాండ్‌తో కలిసి మ్యాక్సీ పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో బ్రెట్ లీ వంటి మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. పార్టీలో పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడంతో మాక్స్‌వెల్ అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయ్యింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: IND vs ENG: పాటిదార్, పుజారా కాదు.. విరాట్ కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాడికి అవకాశం!
తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం గ్లెన్ మాక్స్‌వెల్‌ను సీఏ పక్కనపెట్టింది. టీ20 సిరీస్ కోసం మాక్సీకి విశ్రాంతి ఇస్తున్నట్లు సీఏ తెలిపింది కానీ.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు మాక్స్‌వెల్ తన స్నేహితుడి బర్త్ డే పార్టీలో కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని కాలు విరిగింది. దూకుడు ఆటతీరుకు మ్యాక్సీ పేరుగాంచాడు. ప్రపంచకప్ 2023 విజయంలో మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..