Glenn Maxwell imitating Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం (మార్చి 22) చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెపాక్‌లో ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం మంగళవారం రాత్రి ఆర్‌సీబీ జట్టు చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్ చేస్తోంది.
ప్రాక్టీస్ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇమిటేట్ చేశాడు. విరాట్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. మాక్స్‌వెల్ వెనుక నిలబడి కోహ్లీ షాట్‌లను రీక్రియేట్ చేశాడు. విరాట్ ఆడిన ప్రతి షాట్‌ను మ్యాక్సీ అనుకరించాడు. కోహ్లీ మైదానంలో ఎలా నడుస్తాడో కూడా ఆసీస్ ఆల్‌రౌండర్ చేసి చూపించాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా కోహ్లీని ఇమిటేట్ చేశాడు. మైదానంలో బౌలర్ బంతిని ఇచ్చే ముందు విరాట్ ఎలా తన ప్యాంట్‌కు రుద్దుతాడో అచ్చం అలానే చేసాడు.
Also Read: SS Rajamouli Family: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రమాదం.. 28వ అంతస్థులో..!
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన గ్లెన్ మాక్స్‌వెల్, మొహమ్మద్ సిరాజ్‌లకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విరాట్ కూడా గతంలో చాలామందిని ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్, ఇషాన్ కిషన్ లాంటి చాలా మందిని రీక్రియేట్ చేశాడు. సతీమణి ప్రసవం కోసం క్రికెట్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకున్న కోహ్లీ.. ఐపీఎల్ 2024 కోసం తాజాగా లండన్ నుంచి భారత్ వచ్చాడు. ఆర్‌సీబీకి ఈసారి కప్ అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు.
Glenn Maxwell imitating Virat Kohli.
– This is wonderful to watch. 😂👏pic.twitter.com/ewFkOQGCZl
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024