సార్వత్రిక ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీపై గత కొంతకాలంగా నాన్చుతూ వస్తున్నారు. పోటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad).. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తాను జమ్మూ కాశ్మీర్ తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతాననే పుకార్లను తోసిపుచ్చారు. అంతేకాకుండా ఆ పదవిపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. తాను ఉపాధి కోసం వెతకడం లేదని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదని తెలిపారు. ఈ దేశంలో పుట్టిన వారంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారాయన.
యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం నాడు కేంద్రాన్ని హెచ్చరించారు. ఇది అన్ని మతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడం ఆర్టికల్ 370 ని రద్దు చేసినంత సులభం కాదని కూడా అన్నారు.
కాంగ్రెస్ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనపై ఏం చేసినా ప్రతీకారం తీర్చుకోకుండా, రాజనీతిజ్ఞుడిగా ఉన్నందుకు ఆయనకు క్రెడిట్ తప్పక ఇవ్వాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్న�
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ మాత్రమే సవాలు చేయగలదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు.
కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న గులాంనబీ ఆజాద్ ఎట్టకేలకు తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ప్రకటించారు. జమ్మూలో తన మద్దతుదారులతో కలిసి పార్టీ పేరును ఖరారు చేశారు.