కాంగ్రెస్ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేసినా తనపై ప్రతీకారం తీర్చుకోకుండా, రాజనీతిజ్ఞుడిగా ఉన్నందుకు ఆయనకు క్రెడిట్ తప్పక ఇవ్వాలని ఆయన అన్నారు.
Also Read:Swastika Mukherjee: ఆ నిర్మాత నా నగ్న ఫోటోలను పోర్న్ వెబ్ సైట్ లో పెడతానని బెదిరించాడు
“నేను మోడీకి తప్పక క్రెడిట్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆర్టికల్ 370 లేదా CAA లేదా హిజాబ్ ఏ విషయంలోనూ అతనిని విడిచిపెట్టలేదు. కొన్ని బిల్లులు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ అతను దానికి ప్రతీకారం తీర్చుకోకుండా రాజనీతిజ్ఞుడిగా ప్రవర్తించారు” అని గులాం నబీ ఆజాద్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. G23 (కాంగ్రెస్ సీనియర్ నేతల రెబల్ గ్రూప్)కి బీజేపీతో సాన్నిహిత్యం ఉందా అనే అంశంపై గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ.. ‘అది మూర్ఖత్వం. G23 బీజేపీ అధికార ప్రతినిధి అయితే కాంగ్రెస్ వారిని ఎంపీలుగా ఎందుకు చేసింది? ఎంపీలు, ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లా? నేను ఒక్కడినే పార్టీని స్థాపించాను. మిగిలిన వారంతా ఇప్పటికీ ఉన్నారు. ఇది అవివేకం, అపరిపక్వత, చిన్నపిల్లల ఆరోపణ” అంటూ కొట్టిపారేశారు.
Also Read:Limca Book of Records : ఎంపీ సంతోష్ కుమార్‌కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
మునుపటి తరం కాంగ్రెస్ దిగ్గజాల గురించి ఆజాద్ మాట్లాడుతూ, “నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకోగలిగారు. వారికి ఓర్పు ఉంది. వారికి ప్రజల మద్దతు కూడా ఉంది.కొంత కాలం పాటు వారి పనితో వారు పుంజుకోగలిగారు.కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు” అని ఆజాద్ అభిప్రాయపడ్డారు. నాయకత్వంతో కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ తను కాంగ్రెస్ పార్టీతో లేదా కాంగ్రెస్ సిద్ధాంతంతో విభేదాలు లేవు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ భావజాలంతో లేదా మునుపటి కాంగ్రెస్ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అయితే నా పుస్తకంలో అక్కడక్కడా నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌జీ కాలంలో జరిగిన తప్పులను ప్రస్తావించాను. కానీ వాళ్లు పెద్ద నాయకులే అని కూడా చెప్పాను అని ఆజాద్ గుర్తు చేశారు.
కాగా, కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాలుగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకున్న ఆజాద్.. గతేడాది సెప్టెంబర్ 26 ,2022న “డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ”ని ప్రకటించారు. పార్టీకి ఏజ్ బార్ ఉండదని,యువకులు- అనుభవజ్ఞులు పార్టీలో కలిసి ఉంటారని ఆజాద్ చెప్పారు.
I must give credit to Modi for what I did to him. He was too generous. As Leader of the Opposition I did not spare him on any issue be it Article 370 or CAA or hijab. I got some bills totally failed but I must give him the credit that he behaved like a statesman, not taking… pic.twitter.com/RFyd6PYwU8
— ANI (@ANI) April 4, 2023