సార్వత్రిక ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీపై గత కొంతకాలంగా నాన్చుతూ వస్తున్నారు. పోటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ మంగళవారం దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనంతనాగ్-రాజౌరీ నుంచి పోటీ చేయనున్నారు. ఆజాద్ 2022లో కాంగ్రెస్‌తో ఉన్న తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. అటు తర్వాత డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) పేరుతో సొంత పార్టీని స్థాపించారు.
ఇది కూడా చదవండి: Kismat OTT : సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మంగళవారం డీపీఏపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆజాద్‌ను అనంతనాగ్ నుంచి పోటీ చేయాలని నాయకులు కోరినట్లు ఆ పార్టీ నేత మొహియుద్దీన్ తెలిపారు. 2014లో ఉధంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత జితేంద్ర సింగ్ చేతిలో ఓడిపోయారు. ఇక కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత ఆజాద్‌కు ఇది మొదటి లోక్‌సభ ఎన్నికలు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆజాద్… జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి 2022లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత.. ఆ పార్టీని విమర్శిస్తూ రిజైన్ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
కేంద్ర పాలిత ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికలు మొదటి ఐదు దశల్లో ఏప్రిల్ 19 (ఉదంపూర్), ఏప్రిల్ 26 (జమ్మూ), మే 7 (అనంతనాగ్-రాజౌరీ), మే 13 (శ్రీనగర్), మే 20 (బారాముల్లా)లలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: AP Schools: స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. రోజుకు 3సార్లు వాటర్ బెల్