మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తాను జమ్మూ కాశ్మీర్ తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతాననే పుకార్లను తోసిపుచ్చారు. అంతేకాకుండా ఆ పదవిపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. తాను ఉపాధి కోసం వెతకడం లేదని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గులాం నబీ ఆజాద్‌ను నియమించే అవకాశం ఉందని రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) స్థాపన దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.
Read Also: బనానా తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..
గులాం నబీ ఆజాద్.. గతేడాది కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ)ని స్థాపించారు. అయితే భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిలుపు మేరకే ఆయన జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చారని విమర్శిస్తున్నారు. దీనిని ప్రస్తావిస్తూ.. “నేను 2005లో ఇక్కడకు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని.. రెండు ముఖ్యమైన (కేంద్ర) మంత్రిత్వ శాఖలను (గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి మరియు పార్లమెంటరీ వ్యవహారాలు) కూడా వదులుకున్నట్లు ఆయన చెప్పారు.
Read Also: Asian Games 2023: చైనా చేతిలో ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు.. చేజారిన పసిడి పతకం
అంతేకాకుండా.. జమ్మూ కాశ్మీర్ లో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. అవి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని తెలిపారు. ఈ ప్రాంతం పర్యాటక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వాటిని పరిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే.. ద్రవ్యోల్బణం భారతదేశంలో అత్యధికంగా ఉందని చెప్పారు. యూరప్‌లో కూడా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిని ఎదుర్కోవటానికి వారికి ఇతర మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక టూరిజంపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా జమ్మూకశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో 10 నుంచి 12 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది తన ప్రణాళిక అన్నారు. పర్యాటకం వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలిపారు.