మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గని”. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న “గని” ఆహాలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘గని’ గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు OTT చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారట.…
గత రెండు నెలల నుంచి బిగ్ స్క్రీన్ పై పెద్ద సినిమాలదే హవా నడుస్తోంది. రాధేశ్యామ్ మొదలుకొని ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల రచ్చ ఇంకా కొనసాగుతోంది. దీంతో చిన్న సినిమాల విడుదలకు వెనకడుగు వేశాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. పాన్ ఇండియా సినిమా ఫీవర్ కాస్త తగ్గింది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయడానికి ఇప్పుడు చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక బాక్సర్ గా వరుణ్ నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ఓటిటీ హక్కులను ఆహా వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా “గని” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనే రాగా, ఈ సినిమా కన్నడ వెర్షన్…
వరుణ్ తేజ్ ‘గని’ మూవీ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ కు, ‘గని’ చిత్ర బృందానికి విషెస్ చెప్పింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. మామూలుగా అయితే… ఇందులో పెద్దంత ప్రత్యేక ఏమీ లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనే పుకారు షికారు చేస్తోంది. ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అయోధ్య భామ… వరుణ్ తేజ్ సరసన తొలిసారి ‘మిస్టర్’…
బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ తెలుగువాళ్ళకు సుపరిచితుడే! పలు హిందీ, మరాఠీ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన పదిహేనేళ్ళ క్రితం గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ మూవీతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చిత్రం ఏమంటే ఆయన హిందీలో డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో ఫ్రీ మేక్ కూడా అయిపోయాయి. అయితే ఆ మధ్య ఆయన రూపొందించిన మరాఠీ సినిమా ‘నట సమ్రాట్’ను కృష్ణవంశీ ఇప్పుడు…
గత వారంలో తెలుగులో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దంత సందడి చేయలేకపోయింది. బంజారా చిత్రం ‘సేవాదాస్’, ఆంగ్ల అనువాద చిత్రం ‘మోర్బియస్’ కూడా లాస్ట్ ఫ్రైడే విడుదలయ్యాయి. అయితే గత వారం కూడా థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సందడే కనిపించింది. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గడంతో ‘ట్రిపుల్ ఆర్’కు రిపీట్ ఆడియెన్స్ రావడం మొదలు పెట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 8వ తేదీ 7 సినిమాలు! ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ఏడు సినిమాలు తెలుగులో…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు “Ghani” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. మెగా అభిమానులను ఎంతగానో వెయిట్ చేయించిన “గని” పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు థియేటర్లలోకి ఏప్రిల్ 8న రానుంది. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, “Ghani”కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ? అనే విషయంపై…
ఉపేంద్ర.. ఈ పేరు వినగానే రా, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఒక రూపం దర్శనమిస్తుంది. కన్నడ స్టార్ హీరోగా ఎంత ఎదిగినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉపేంద్ర సినిమా హీరోగానే కొలువుండి పోతారు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర, వరుణ్ తేజ్ నటించిన గాని చిత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ కానుంది. ఇక దీంతో నేడు హైదరాబాద్ లో…
దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన రియల్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’. అలాంటి సినిమా తెలుగులో ఇప్పట్లో మరొకటి తెరకెక్కుతుందో లేదో తెలియదు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కానీ వాటిని ‘రియల్ మల్టీస్టారర్’ కేటగిరిలో వేయడానికి ట్రేడ్ వర్గాలు అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ యువ కథానాయకులు మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళతో సినిమాలు చేశాడు. అందులో…