ఉపేంద్ర.. ఈ పేరు వినగానే రా, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఒక రూపం దర్శనమిస్తుంది. కన్నడ స్టార్ హీరోగా ఎంత ఎదిగినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉపేంద్ర సినిమా హీరోగానే కొలువుండి పోతారు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర, వరుణ్ తేజ్ నటించిన గాని చిత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ కానుంది. ఇక దీంతో నేడు హైదరాబాద్ లో గని రిలీజ్ పంచ్ అని ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేదికపై ఉపేంద్ర మాట్లాడుతూ ఆయనకు, మెగా ఫ్యామిలీ కి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఐయామ్ గాడ్ గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ తన ఫేమస్ డైలాగ్ తో అభిమానులను ఉర్రుతలూగించారు.
” అందరికి నమస్కారం.. నా గురించి మీకు 24 ఏళ్ళ క్రితం ఉపేంద్ర సినిమాతో తెలుసు.. సినిమా గురించి మాట్లాడే దానికన్నా ముందు మెగాస్టార్ ఫ్యామిలీతో నాకున్న అనుబంధం చెప్తాను. 24 ఏళ్ల క్రితం రాజశేఖర్ తో ఓంకారం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న సమయంలో నాకు చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అశ్వినీదత్ గారు ప్రొడ్యూసర్.. కానీ నాకు ఆ అదృష్టం లేదు.. ఆ ఫిల్మ్ చేయలేకపోయాను. ఇప్పటికీ ఆ విషయంలో నేను విచారిస్తున్నాను. ఆ తరువాత నేను హీరోగా చేసిన ఒక్క మాట చిత్రంలో నాగబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేశాను. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్నాను. నాకు మెగా ఫ్యామిలీతో నటించే ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఫ్యామిలీ నన్ను మర్చిపోకుండా మళ్లీ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇక ఈ సినిమాలో వరుణ్ ని చూశాక భయమేసింది. ఆ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడు.. నిజంగా అందరికి అతను ఇన్స్పిరేషన్. నేను గద్దలకొండ గణేష్ సినిమా చూసాను.. ఇప్పుడు గని చూస్తునాను.. కటౌట్ బాడీని ఇలా ట్రాన్స్ ఫార్మ్ చేయడం .. గ్రేట్.. కన్నడ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. తప్పకుండ ఈ సినిమాను అందరు చూడండి” అని తెలిపారు.
https://www.youtube.com/watch?v=GY3p8NCIWRE