పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండం అయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా నేలమట్టం అయింది. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం, ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లను జోర్డాన్, ఈజిప్ట్‌లకు తరలిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ శనివారంలోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేకుంటే హమాస్‌కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత అరబ్ దేశాలు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Raghu Babu: చిరంజీవి ప్రశంసించడం వల్ల.. 400 సినిమాల్లో అవకాశాలు
తాజాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందించారు. శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేశాడు. ఈ మేరకు జెరూసలేం పోస్ట్‌లో పేర్కొన్నారు. అల్-జజీరాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని.. ఒకేసారి బందీలను విడుదల చేసేదీలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అందుకోసమే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని హమాస్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య.. భార్య ఏం చేసిందంటే..!
జనవరి 19 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. హమాస్ దగ్గర 76 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు హమాస్ 16 మంది ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడుదల చేసింది. ఇక ఒప్పందంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 15) మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. కానీ ట్రంప్ మాత్రం మొత్తం బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం విధించారు. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. ‘‘నాకు సంబంధించినంతవరకు శనివారం 12 గంటలలోపు బందీలందరినీ తిరిగి అప్పగించాలి. ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. లేదంటే కాల్పు విరమణ ఒప్పందం రద్దు చేయమని నేను చెబుతాను. అన్ని మార్గాలు మూసిపోతాయి. అనంతరం నరకం చూస్తారు.’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!