Gaza: ఒక వైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ గురించి ఈజిప్టులో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులు నిర్వహించాయి.
గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకోవైపు గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనపై ఉక్కుపాదం మోపారు.
Middle East: పశ్చిమాసియా గత ఏడు నెలలుగా యుద్ధ భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 7, 2023న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు.
గత కొద్ది రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
Gaza Crisis : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గాజాకు వెళ్లేందుకు వేచి ఉన్న ట్రక్కుల పొడవైన లైన్ దగ్గర నిలబడి ఒక ప్రకటన చేశారు. శనివారం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. సరిహద్దులో ఓ వైపు లారీలు నిలిచిపోయాయని, మరో వైపు దేశ ప్రజలంతా పస్తులు ఉండాల్సి వచ్చిందన్నారు.
ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ఆహారం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో మరణించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించడంతో పాటు 150 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.