Gaza : గాజాలో యుద్ధంతో ఆకలికి అలమటిస్తున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు. ఇజ్రాయెల్ దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నందున గాజాలో మానవతా సహాయానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో గాజా ప్రజలకు ఆహారం కూడా దొరకడం కష్టంగా మారింది. ఎక్కడ చూసినా జనాల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చివరకు తుపాకుల సాయంతో ట్రక్కులను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కరెంటు, తిండితో పాటు గుక్కెడు మంచి నీరు కూడా దొరకక పౌరుల బతుకు దుర్భరంగా తయారైంది. ఫార్మసీ షాపుల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. నిత్యవసర సరకుల కోసం ఎక్కడ చూసినా భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంటోంది. మానవతాసాయం ట్రక్కుల్లోని మంచి నీళ్ల బాటిళ్ల కోసం పెద్దలు, చిన్న పిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.
Read Also:Payal Rajput: రిషబ్ శెట్టి… నన్ను ట్రై చేయండి!… అంటూ హీరోయిన్ రిక్వెస్ట్
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
యుద్ధం కొనసాగుతున్నందున గాజా జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి సీనియర్ సహాయ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి, మరో 240 మందిని బందీలుగా పట్టుకున్నప్పటి నుండి గాజా అంతటా జనాల కదలికలు తగ్గిపోయాయి. దీంతో పాటు గాజా నుంచి రాకపోకలను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఇది వైమానిక దాడులను ప్రారంభించింది. గాజా ప్రజలు ఎక్కువగా ఆధారపడే సహాయ పంపిణీలను పరిమితం చేసింది. ఏడు వేలకు పైగా పిల్లలతో సహా 17,700 మందికి పైగా గాజా ప్రజలను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇప్పటివరకైతే ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్ మాత్రమే తెరిచారు. దీంతో గాజాకు పరిమితంగానే సహాయం అందుతోంది.
Read Also:IPL Auction 2024: ఫ్రాంచైజీల కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే.. కోట్ల వర్షం పక్కా!
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!