Ibrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. అతని మరణం ఇజ్రాయెల్ చేసిన పెద్ద కుట్రలో భాగమని కొందరు చెబుతుండగా, మరికొందరు అతని మరణం వెనుక ఇరాన్ ప్రజలు ఉన్నారని పేర్కొంటున్నారు.
Turkish President Erdogan : ఇజ్రాయెల్‌పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి మండిపడ్డారు. ఇంటర్నేషనల్ బెనివలెన్స్ అవార్డ్స్ ఈవెంట్‌లో ఎర్డోగన్ పాల్గొన్నారు.
Israel Attack : గాజా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఆగడం లేదు. ఇప్పుడు దక్షిణ గాజాలోని రఫా నగరం రణరంగంగా మారిపోయింది. గాజాలో దాడుల తరువాత, పాలస్తీనియన్లు దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఆశ్రయం పొందారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు.
ఇజ్రాయెల్ కు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా మాటలను లెక్కచేయకుండా గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ కు వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ ను నిలిపేసినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ దళాలు రఫా క్రాసింగ్‌లోని పాలస్తీనా భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో మంగళవారం ఈ విషయాన్ని పేర్కొంది. ధ్రువీకరణ కోసం ఇజ్రాయెల్ సైన్యం త్వరలో ఒక ప్రకటనను ప్రచురిస్తుందని తెలిపింది.
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని ప్రకటించింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు.
Gaza: ఒక వైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ గురించి ఈజిప్టులో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులు నిర్వహించాయి.