ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత తొమ్మిది నెలలుగా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ మంగళవారం దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోని పాఠశాలపై దాడి చేసి సుమారు 19 మందిని హతమార్చింది. అదే సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు. పాలస్తీనా ఆరోగ్య అధికారులు మంగళవారం తెలియజేశారు. ఒక రోజులోపు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సరి కొత్త ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో కాల్పుల విరమణ, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదల గురించి కూడా ఉన్నాయి.
రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి.
హమాస్ సృష్టించిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెలీయులను బందీలుగా తీసుకెళ్లిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇజ్రాయెల్ మహిళా సైనికుల పట్ల క్రూరత్వం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది.