ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని ప్రకటించింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నామని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు.
గత ఏడు నెలలుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. ఇంకోవైపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. రఫాలో హమాస్‌ను అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gudivada Amarnath: మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోడీ క్లారిటీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారు..!
మేడే సందర్భంగా కార్మికులనుద్దేశించి కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో మాట్లాడుతూ.. గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక జాతి విధ్వంసక ప్రధానితో తాము ఇక సంబంధాలు కొనసాగించలేమని తేల్చిచెప్పారు. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదన్నారు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లేనని గుస్తావో పెట్రో స్పష్టం చేశారు.
కొలంబియా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ స్పందించింది. గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..
హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతోంది. ఇంకోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులు చేస్తోంది. ప్రస్తుతం దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది.
ఇది కూడా చదవండి: SHR vs RR: సన్‌రైజర్స్ ప్లేయర్లకు చేదు అనుభవం.. స్టార్ ఆటగాడిని తోసేసిన ఫాన్స్!