Turkish President Erdogan : ఇజ్రాయెల్‌పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి మండిపడ్డారు. ఇంటర్నేషనల్ బెనివలెన్స్ అవార్డ్స్ ఈవెంట్‌లో ఎర్డోగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని తీవ్రంగా విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది గాజన్లు కోల్పోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద ఊచకోతగా ఆయన అభివర్ణించారు. గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోకపోతే ప్రపంచం మరో పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఎర్డోగన్ ఇక్కడితో ఆగలేదు. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, సహాయం అందిస్తున్న దేశాలపై కూడా ఆయన మండిపడ్డారు. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కులపై ఇతర దేశాలకు ప్రసంగాలు ఇచ్చే దేశాలు ఇజ్రాయెల్‌కు సాయం చేస్తూ గాజాలో నరమేధాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. పాశ్చాత్య శక్తులు ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ, ఇజ్రాయెల్ ఆక్రమణ విస్తరణను ఆపకపోతే, ఆ ప్రాంతంలో కొత్త వివాదం తలెత్తుతుందని టర్కీ అధ్యక్షుడు హెచ్చరించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయిందని, మానవతావాదులు దీనిని ఖండిస్తున్నారని ఆయన అన్నారు.
Read Also: Manushi Chhillar: బికినీలో మానుషి చిల్లర్ అందాలు చూడతరమా..
పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఐర్లాండ్, నార్వే, స్పెయిన్ నిర్ణయాలను అధ్యక్షుడు ఎర్డోగన్ స్వాగతించారు. ఇది కాకుండా, పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి రెండు దేశాల ఒప్పందం ప్రకారం పాలస్తీనాను దేశంగా గుర్తించాలని ఆయన ఇతర దేశాలకు కూడా విజ్ఞప్తి చేశారు.
‘పాలస్తీనాలో శాంతికి రెండు దేశాల ఒప్పందమే పరిష్కారం’
మధ్యప్రాచ్యంలో శాంతికి 1967 సరిహద్దులపై రెండు దేశాల ఒప్పందమే ఏకైక పరిష్కారమని ఐర్లాండ్ ప్రభుత్వం బుధవారం పాలస్తీనాకు గుర్తింపు ప్రకటించింది. ‘మేము అరబ్ దేశాల శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తున్నాము. మే 28న పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తాము. దీని తరువాత పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే మొత్తం దేశాల సంఖ్య సుమారు 147కి పెరిగింది. ఇది అఖండమైన ప్రపంచ ఏకాభిప్రాయాన్ని చూపుతుంది.’ అని పేర్కొన్నారు.
Read Also: AP CEO MK Meena: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి..