Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1400 మందిని హతమర్చాడమే కాకుండా, ఇజ్రాయిల్ లోని 240 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి బందీలుగా పట్టుకెళ్లింది. అయితే ఇందులో ఇప్పటికే కొంతమందిని చంపేసినట్లు తెలుస్తోంది. తాజాగా 19 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళా సైనికురాలు హత్యకు గురైనట్లు డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ రోజు సౌదీ అరేబియా వేదికగా ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్(ఓఐసీ) రియాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాపై జరుపుతున్న దాడిపై ఈ దేశాలు చర్చించాయి. గాజా స్ట్రిప్ లో ప్రస్తుత యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఆర్మీని ‘‘ఉగ్రవాద సంస్థ’’గా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇతర ఇస్లామిక్ దేవఆలకు పిలుపునిచ్చారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గాజాపై దాదాపు 6,000 బాంబులను పడవేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ దేశం హమాస్ స్థానాలపై దాడి చేస్తున్నాడని కూడా చెప్పబడింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది. గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు జరుగుతున్నాయి.
అక్టోబర్ 7, 2023, ఉదయం సమయం. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించింది. సాధారణ రోజుల మాదిరిగానే ప్రజలు నిద్రలేచిన తర్వాత వారి రోజువారీ కార్యకలాపాల వైపు వెళ్లవలసి ఉండగా, వందలాది మంది ప్రజలు నిద్ర నుంచి మేల్కొనలేని విధంగా ఉదయం ప్రారంభమైంది.
Israel: ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య తీవ్ర యుద్ధం చెలరేగింది. గాజా స్ట్రిప్‌ని పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. పటిష్ట ఇంటెలిజెన్స్ నిఘా, గూఢచార సంస్థలు ఉన్న ఇజ్రాయిల్ ఈ దాడుల్ని ఊహించలేకపోయింది. ఏకంగా 20 నిమిషాల్లోనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే ఈ దాడుల వల్ల ఇజ్రాయిల్ లో 40 మంది మరణించారు. 700 మందికి పైగా గాయాలయ్యాయి.
21 Dead, Including 9 Children In Gaza Home Fire: పాలస్తీనా గాజా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరానికి ఉత్తరంగా ఉన్న ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఇంధనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. పాలస్తీనాను నియంత్రించే హమాస్ ఇస్లామిస్టులు, స్థానిక అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పేశాయి. 21 మంది మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.