21 Dead, Including 9 Children In Gaza Home Fire: పాలస్తీనా గాజా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరానికి ఉత్తరంగా ఉన్న ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఇంధనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలతో సహా మొత్తం 21 మంది మరణించారు. పాలస్తీనాను నియంత్రించే హమాస్ ఇస్లామిస్టులు, స్థానిక అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పేశాయి. 21 మంది మరణించినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.
Read Also: Flipkart Apple Days Sale: ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్
జాబాలియాలోని ఇండోనేషియా ఆస్పత్రి చీఫ్ సలేహ్ అబు లైలా మాట్లాడుతూ.. ఏడుగురు పిల్లల మృతదేహాలను కనుక్కున్నట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి అసలైన కారణాలు తెలియనప్పటికీ.. ఇంధనం ఇంట్లో నిల్వ చేయబడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఈ ప్రమాదాన్ని ‘‘జాతీయ విషాదం’’గా అభివర్ణించారు. శుక్రవారం సంతాపదినంగా ప్రకటించారు. మెరుగైన వైద్యచికిత్స కోసం దక్షిణ ఇజ్రాయిల్, గాజాను కలిపే ఎరేజ్ క్రాసింగ్ తెరవాలని పాలస్తీనా అధికారులు ఇజ్రాయిల్ ను కోరారు.
ఇజ్రాయిల్ రక్షణ మంత్రి జెన్నీ గాంట్జ్ గాజాలో జరిగిన ఘటనను తీవ్రమైన విపత్తుగా చెప్పారు. గాయపడిన వారిని మానవతా మానవతా దృక్పథంతో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 2 లక్షల మంది ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయిల్ దిగ్భంధంలో ఉంది. అక్కడ హమాస్ టెర్రరిస్టులు పాలన చేస్తున్నారు.