పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ సొంత ప్రజల పైనే తన కోపాన్ని చూపిస్తోంది. ఇటీవల గాజా స్ట్రిప్‌లోని ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘‘హమాస్ అవుట్’’ అంటూ నినదించారు. అయితే, ఈ పరిణామాలు హమాస్ ఉగ్ర సంస్థకు నచ్చలేదు. దీంతో సొంత ప్రజలనే ఉరితీసి చంపేస్తోంది. హమాస్ ఇప్పటి వరకు కనీసం ఆరుగురు గాజా ప్రజల్ని ఉరితీసినట్లు తెలుస్తోంది. కొందరిని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, చాలా మందికి బహిరంగంగా…
Female Hostages Released: గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా…
Israel : గాజా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ సమయంలో గాజా స్ట్రిప్‌లో జరిగిన రహస్య ఆపరేషన్‌లో సైనికుడు స్టాఫ్ సార్జెంట్ ఒరాన్ షాల్ మృతదేహాం అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) పేర్కొంది.
Israel PM: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు.
Isreal- Gaza Conflict: పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను క్రమంగా పెంచుతుంది. తాజాగా, గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు.
Mass Shooting : గాజాకు సాయంపై నిషేధం విధించిన తర్వాత పాలస్తీనియన్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. గురువారం సాయం కోసం ఎదురుచూస్తున్న పౌరులపై ఇజ్రాయెల్ ఆర్మీ బహిరంగ కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్‌కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ విమానాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు చేస్తున్నాయి.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 49 రోజులు అవుతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ నిరంతరం గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులను నిర్వహిస్తోంది.