గాజాను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు దూసుకుపోతుంది. ఇందులో భాగంగా దాడులను ఉధృతం చేసింది. సోమవారం గాజా ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి జరిగింది.
హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం ఆస్పత్రి సొరంగంలో లభ్యమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గత నెలలో మొహమ్మద్ సిన్వర్‌ను చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
Israel: గాజాలోని ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఇటీవల ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను ప్రపంచం ముందుంచింది. ముఖ్యంగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి హమాస్‌కి ప్రధాన కేంద్రంగా ఉందని, ఈ ఆస్పత్రి కింద హమాస్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ గుర్తించింది. ఈ ఆస్పత్రిని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలై నెల రోజులు గడిచాయి. హమాస్ ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేంది లేదని స్పష్టం చేసింది. అయితే గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఆర్మీ చుట్టుముట్టింది. ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందుకే వాటిని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రి చుట్టు ఇజ్రాయిల్ తన ట్యాంకుల్ని మోహరించింది.