Israel-Pakistan: బయటకు ఇజ్రాయిల్ అంతే శత్రుదేశంగా భావించే పాకిస్తాన్, తెర వెనక మాత్రం ఇజ్రాయిల్ స్నేహాన్ని కోరుకుంటోంది. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌లో తెహ్రీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్‌పీ) పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళల్ని నిర్వహించింది. దీనిని పాక్ ఆర్మీ, పోలీసులు కఠినంగా అణిచివేశారు. సొంత ప్రజలపైనే కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో పలువురు మరణించారు.
Hamas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్-హమాస మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపేశారు. 20 మంది బతికి ఉన్న బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బందీల విడుదలతో ఇజ్రాయిల్ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ ఆనందం మాటున ఒక విషాదం కూడా దాగుంది. రెండేళ్ల క్రితం అక్టోబర్ 07,2023లో హమాస్ జరిపిన దాడిలో, కిడ్నాప్‌కు గురైన నేపాల్ హిందూ విద్యార్థి బిపిన్ జోషి మరణించారు. అతడి…
PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన గాజా శాంతి ఒప్పంద ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ బందీల విడుదలతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణకు అవకాశం ఉంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
Qatar Summit: ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయాంలో ఖతార్ రాజధాని దోహాలో సోమవారం నుంచి అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో 50 కి పైగా ముస్లిం దేశాలు పాల్గొనబోతున్నాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం దేశాలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాకుండా, అమెరికాను కూడా కలవరపెడుతుంది. READ ALSO: OG : సుజీత్ కు…
Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ పదవికి ముందు వరసలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నగర మేయర్‌గా ఎన్నికైతే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను నగరంలోకి ప్రవేశిస్తే, అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీస్ శాఖను ఆదేశిస్తానని అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని నేను నేరవేర్చాలనుకుంటున్నానని అన్నారు.
ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం వైమానిక దాడులను ఖండించారు. అనంతరం పాకిస్థాన్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్…
US Airstrike On Syria: సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్-దిన్ అనే…
Female Hostages Released: గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా…