Israel: లెబనాన్ మిలిటెంట్ సంస్థ, ఇరాన్ ప్రాక్సీగా చెప్పబడుతున్న హిజ్బుల్లా మరోసారి ఇజ్రాయిల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ నగరమైన సఫేద్, దాని పరిసర ప్రాంతాలపై 55 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. లెబనాన్ నుంచి రెండు దఫాలుగా దాడి జరిగిందని, మొదటిసారి సుమారు 20 రాకెట్లు, రెండోసారి 35 రాకెట్లు ప్రయోగించబడినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు.
గత 11 రోజులుగా ఇజ్రాయిల్… గాజాల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గాజాలోని హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య భీకరమైన పోరు జరిగింది. జేరూసలెంపై హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లతో దాడులు చేయగా, ఇటు ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 200 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు కాగా, లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడులు ఆపాలని, కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి రావడం…