PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఈ సమావేశంలో గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించడం, మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే.. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారా లేదా అనేది ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఇంకా ధృవీకరించలేదు.
READ MORE: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు చేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్..
ఈజిప్టు ప్రెసిడెన్సీ అధికారిక ప్రకటన ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ట్రంప్, సీసీ సంయుక్త అధ్యక్షతన జరిగే సమావేశానికి 20కి పైగా దేశాల నాయకులు పాల్గొంటున్నాయి. “గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ముగించడం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో భద్రత కోసం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం ఈ శిఖరాగ్ర సమావేశం లక్ష్యమని ప్రకటన పేర్కొంది.