Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్‌లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ…
విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
గుజరాత్ రాష్ట్రంలో గ్యాస్ సిలండర్ పేలిన ఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతిచెందారు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు..
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఓజిలి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్దం రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
పంజాబ్ ముక్త్‌సర్‌లోని గిద్దర్‌బాహాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. డేరా సిద్ధ్ బాబా గంగా రామ్ వార్షికోత్సవ కార్యక్రమంలో సిలిండర్ పేలడంతో ఏడుగురు సేవకులకు మంటలు అంటుకున్నాయి. కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రెఫర్ చేశారు. భటిండాకు రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి 60-70 శాతం కాలిన గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు శబ్ధం విని ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు.