Gas Cylinder Blast: విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది… అయితే, పలువురికి గాయాలు అయ్యాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.. కాగా, స్టీల్ సిటీలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతోంది..
Read Also: TCS Employees in Dilemma: గందరగోళంలో టీసీఎస్ ఉద్యోగులు.. జీతం పెంచినా.. ఉద్యోగ భద్రతపై భరోసా ఏది?
సిలిండర్ పేలుడు జరిగిన ప్రాంతంలో చల్లాచెదురుగా పడిపోయారు క్షతగాత్రులు.. ఇక, గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మృతదేహాలు ఉన్నాయి.. ఘటన స్థలానికి చేరుకున్న సహాయ బృందాలు, అంబులెన్స్.. సహాయక చర్యలు చేపట్టాయి.. అసలు మాంసం ముద్దలుగా మృతదేహాలు మారిపోవడం షాక్‌కు గురిచేస్తోంది.. అయితే, వెల్డింగ్ చేసే సిలిండర్ పేలినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. ఇప్పటివరకు ముగ్గురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం.. మరోవైపు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్.. ప్రమాదంపై ఆరా తీశారు..