గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగరాదని, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎల్‌బీ నగర్ జోన్‌లో పర్యటించి గణేష్ నిమజ్జనానికి చెరువులు, బేబీ పాండ్స్ సంసిద్ధత, ఏర్పాట్లను పరిశీలించారు.
హిందూ మతంలో గణేష్ చతుర్థి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేశ చతుర్థి రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ప్రత్యేక ఆచారం. అయితే గణేష్ చతుర్థికి ముందు విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం రెండింటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Ganesh Chaturthi 2024: హిందూ మతంలో వైశాఖ మాసం చాలా ముఖ్యమైనది. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చతుర్థి జరుపుకోనున్నారు. ఈ రోజున గణేశుడిని ఆచారాలతో పూజిస్తారు. హిందూమతంలో పూజించబడే మొదటి వ్యక్తిగా వినాయకుడిని పరిగణిస్తారు. వినాయకుడిని తలుచుకుని ఏదైనా శుభ కార్యం ప్రారంభిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అంటారు. దీని వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. వినాయక…
Bhakthi: హిందు పురాణాల ప్రకారం ఏదైనా పనిని ప్రారంభించే ముందు తొలి పూజ వినాయకునికి చెయ్యాలని సూచిస్తారు మన పెద్దలు. ఇదే ఇప్పటికి ఆనవాయితీగా వస్తుంది. విగ్నేశ్వరుడు భోజన ప్రియుడు. అందుకే విగ్నేశ్వరుడికి పూజ చేసే సమయంలో కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం మొదలైన పదార్ధాల్ని నైవేద్యంగా పెడతాము. అలానే గణపతిని రకరకాల ఆకులతో పువ్వులతో పూజిస్తాం. కానీ తులసి ఆకులతో మాత్రం పూజించకూడదు అని పండితులు చెప్తుంటారు. అన్ని ఆకులతో చివరికి గరికతో పూజించిన సంతోషించే స్వామిని…
ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
ముంబైలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించబడిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణనాథుడిని గౌర్ సరస్వత్ బ్రాహ్మణ (జీఎస్‌బి) సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.