ముంబైలో 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించబడిన గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ గణనాథుడిని గౌర్ సరస్వత్ బ్రాహ్మణ (జీఎస్‌బి) సేవా మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గణేష్ చతుర్థికి 36 కిలోల వెండి, 250 గ్రాముల బంగారు లాకెట్టు విరాళంగా ఇచ్చినట్లు GSB సేవా మండల్ ప్రతినిధి ఓ వార్త సంస్థకు తెలిపారు. ఈ విరాళంతో విగ్రహంలోని మొత్తం బంగారం 69 కిలోలు, వెండి మొత్తం 336 కిలోలకు పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ ఏడాది 69వ ‘గణపతి ఉత్సవ్’ జరుపుకోబోతున్నామని చెప్పారు.
Read Also: Tax Collections: కేంద్ర సర్కార్ కు భారీగా కాసుల వర్షం.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుతో పెరిగిన ఆదాయం
మరోవైపు చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైనందుకు గణేశుడికి ధన్యవాదాలు తెలిపేందుకు సెప్టెంబర్ 19 (మంగళవారం) రోజున ప్రత్యేక ‘హవనం’ నిర్వహించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు సెప్టెంబర్ 20న మరో హవనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అక్కడ నిర్వహించే పందాల వద్దకు వచ్చే ప్రజలకు రూ.290 కోట్లు, ఆభరణాలకు రూ.39 కోట్లు, ప్రజాబాధ్యత కింద రూ.20 కోట్లు కలిపి మొత్తం రూ.360.45 కోట్లు బీమా చేయించామని మండల ప్రజాప్రతినిధి తెలిపారు. ఇక భద్రత విషయానికొస్తే.. ఈ ఏడాది ఫేషియల్ రికగ్నిషన్ చేస్తామని.., ఈసారి అధిక సాంద్రత కలిగిన కెమెరాలను అమర్చామన్నారు.
Read Also: MP Vijayasai Reddy: చంద్రబాబుపై తీవ్ర విమర్శలు.. రాజ్యసభలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి
గణేష్ చతుర్థి వేడుకలు 10 రోజుల పాటు అంగరంగా వైభవంగా జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేయనున్నారు. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఉత్సవాలు సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 29 వరకు జరుగనున్నాయి.
#WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai – by GSB Seva Mandal – installed for the festival of #GaneshChaturthi.
The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6
— ANI (@ANI) September 18, 2023