పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే దాయాది దేశం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పినట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
IAS Officer Wife: గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్‌జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సూర్య జై తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్ పటేల్‌పై 7 లక్షల ఓట్ల ఆధిక్యతతో అఖండ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. అమిత్ షాకు మొత్తం 10,109, 72 ఓట్లు రాగా, పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గాంధీనగర్ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. 34 నాలుగేళ్లుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. అటల్ బిభారీ వాజ్ పేయి, అధ్వాణి వంటి బీజేపీ కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే గెలుపొందారు.
PM Modi: గుజరాత్ గాంధీనగర్‌లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్‌లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సర్వత్రా ఉత్కంఠ రేపిన ఫలితాలు ఇవాళ (శనివారం) వెలువడగా, రాజధాని బెంగళూరు నడిబొడ్డున ఉన్న గాంధీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దినేష్ గుండూరావు కేవలం 105 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.