PM Modi: పహల్గామ్‌కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్‌కు బుద్ధి చెప్పాం
- పహల్గామ్‌కు ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్‌కు బుద్ధి చెప్పాం
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని మోడీ
- తగిన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే దాయాది దేశం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పినట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌లో రెండో రోజు పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు రుజువులు అడుగుతున్నాయని.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలిపారు. గతంలో చేసిన వైమానిక దాడులపై కూడా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయని.. కానీ ఈసారి మాత్రం ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను అంతం చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Karnataka: ముస్లిం ఐఏఎస్‌పై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం
Also Read
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ పలు కఠి నిర్ణయాలు తీసుకుంది. పాక్‌కు సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్‌లో పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాళ్లు బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!
ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని భారత్‌పై పాకిస్థాన్ యుద్ధం చేస్తుందన్నారు. అందుకే భారత్ నుంచి ఉగ్రవాద ముల్లును తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 75 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలా భరిస్తూనే ఉండాలా? అందుకే పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. భారత్.. శాంతిని నమ్ముతుందని.. కానీ పదే పదే రెచ్చగొడితే మాత్రం.. తిరిగి దాడికి చేయడానికి భారత్ వెనుకాడదని హెచ్చరించారు. భారత్ కూడా యోధుల భూమి అని ప్రపంచానికి గుర్తు చేయాలన్నారు.
With over two decades of transformative urban development, Gujarat is setting new benchmarks in building world-class cities. Addressing a programme in Gandhinagar. https://t.co/SY9QY6nqDB
— Narendra Modi (@narendramodi) May 27, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు