పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు.
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటుండగా క్రాకర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాక పట్టణంలోని వడ్లపూడి రజకవీధిలో చోటుచేసుకుంది. ఈ ఘనటనపై సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనటనతో రజకవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read: New Year 2025: కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో బెజవాడ పోలీసులు! 2025 నూతన సంవత్సరం నేపథ్యంలో…
విశాఖలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది.
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విశాఖలోని గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్(33) ఇటీవల ఎంబీఏ పూర్తి చేసి.. ఎంఎస్ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న నాగప్రసాద్‌కు ఫణికుమార్ రూమ్‌మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు.
తొమ్మిరోజుల పాటు.. 11 రోజుల పాటు.. 15 రోజుల పాటు.. ఇలా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు భక్తులు.. అయితే, ఈ సారి గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు..
భిన్నంగా గణపతిని అలంకరించే విధానంలోనూ డిఫరెంట్ ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో నుంచి రూపుదిద్దుకున్నదే బెల్లం గణపతి. గాజువాక బడ్ డిపో దగ్గర లంబోధర అసోసియేషన్ 70 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహం ఏర్పా టు చేసింది. సుమారు 18 టన్నుల బెల్లం ఇందు కోసం వినియోగించారు.
Aganampudi Toll Gate: విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ ని ఎట్టకేలకు తొలగించారు.. ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్ గేట్ నుండి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించేవి.. అటు వర్తకులు, చిరు వ్యాపారులు, ఫార్మా కంపెనీలకు వెళ్లే వాహనాలు ఏడాదికి లక్షలాది రూపాయలు టోల్ ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు.. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్ గేట్ కు చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ చార్జీలు కట్టుకోలేక…