నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటుండగా క్రాకర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాక పట్టణంలోని వడ్లపూడి రజకవీధిలో చోటుచేసుకుంది. ఈ ఘనటనపై సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనటనతో రజకవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: New Year 2025: కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో బెజవాడ పోలీసులు!
2025 నూతన సంవత్సరం నేపథ్యంలో రజకవీధిలోని సుద్దమళ్ల శివ అనే వ్యక్తి స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. అర్ధరాత్రి 12:05 కేక్ కట్ చేసే సమయంలో క్రాకర్ వెలిగించాడు. క్రాకర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయి శివ నూదిటిపై పెద్ద గాయం అయింది. గాయం కారణంగా అతడు అక్కడికి అక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే కూర్మన్నపాలెం 4S ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. దాంతో శివ కుటుంబ సభ్యులు భోరుమన్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.