Jakkampudi Raja: కాకినాడ జిల్లాలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. గాజువాక, భీమవరం ప్రజలు రైట్, లెఫ్ట్ లెగ్ లతో తంతే పవన్ పిఠాపురం వచ్చి పడ్డారని మండిపడ్డారు. పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు.
Read Also: Sudden Cardiac Arrest : హఠాత్తుగా కుప్పకూలిపోతున్న యువత – జీవనశైలే కారణమా?
అయితే, వంగవీటి మోహన రంగా, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాపులు హీరోలుగా చూడాలి అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సినిమాల్లో నాలుగు స్టెప్పులు వేసి, బయటకు వచ్చి మైక్ పట్టుకున్న వ్యక్తిని హీరోగా చూడడం దౌర్భగ్యం.. కాపు యువత పవన్ కళ్యాన్ ను హీరోగా భావించి వెనుక తిరిగారు.. వారంతా ఇప్పుడు ప్రశ్నించుకోవాలి.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని తాపత్రాయ పడే వ్యక్తి పవన్ ను హీరోగా చూడడం మన ఖర్మ అని జక్కంపూడి రాజా తెలిపారు.