గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా…
విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో లో కిడ్నాప్ కలకలం రేపుతుంది. యాజమాన్యంలో ఉన్న మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆగ్రహంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు. మారికవలసలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ హెడ్ గా రమేష్ ను తోటి ఉద్యోగులు కిడ్నాప్ చేశారు.
2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Srikakulam : గుర్రాలను చూసుకుంటూ సాయంగా ఉంటాడని యజమాని పనిలో పెట్టుకున్నాడు. కానీ.. తన భార్యతోనే అక్రమ సంబంధం కొనసాగించి తిన్న ఇంటికే కన్నం పెట్టాడు. దీంతో తట్టుకోలేని యజమాని తన అసిస్టెంట్ను చంపి పాతేశాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో గుర్రపు స్వారీ శిక్షకుడి సహాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Operation For Cobra: పాము అంటేనే పరుగులు పెడతారు.. భయంతో వణికిపోతారు.. ఇక నాగుపాము అంటే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎక్కడ పగబడుతుందో ననే భయం వెంటాడుతుంది.. అది కొందరి వరకు మాత్రమే.. పాములను ప్రేమించేవారు ఉన్నారు.. లాలించేవారు ఉన్నారు.. ఇక వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు.. గాయపడిన పాముకు కూడా వైద్యసాయం అందించి తమ వృత్తి ధర్మాన్ని చాటుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఓ నాగపాముకు శస్త్ర చికిత్స అందించారు పశువుల ఆస్పత్రి వైద్యుడు…
38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి ఇప్పుడు తన 45వ షోరూం విశాఖపట్నం సమీపంలోని గాజువాకలో ప్రారంభమైంది.