తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పు పై కృష్ణామోహన్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశ్వపూర్వకంగా ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణామోహన్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని.. తప్పుడు అఫిడవిట్ చూపించి తన పైన అనర్హత వేటు అంటూ ప్రచారం చేశారని కృష్ణామోహన్ రెడ్డి చెప్పారు.
Dil Raju inagurates SVC Cinemas: ఎగ్జిబిటర్గా సినీ కెరీర్ మొదలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఆ తర్వాత దిల్ సినిమా నిర్మించి నిర్మాతగా మారారు దిల్ రాజు. నిర్మాత అయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో టాప్ ప్రొడ్యూసర్ గా మారిన తరువాత కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి గ్రిప్ సాధించుకున్నాడు. Kushi : 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మళ్ళీ ట్రెండింగ్‌లో ‘నా రోజా నువ్వే’ ఎగ్జిబిటర్…
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీకి కొత్త జవసత్వాలు రాకపోగా.. నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు భగ్గుమంది. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న నేతలు ఉత్సాహంగా దూసుకెళ్దామని చూస్తుంటే పార్టీలోకి పాతకాపులు వారి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారట. వలస నేతలు రావడంతో నియోజకవర్గాల్లో నాయకత్వానికి కొరత తీరుతుందని భావిస్తే.. ఆ దిశగా అడుగులే పడటం లేదట. దాదాపు నెల రోజుల పాటు అలంపూర్ మొదలు షాద్‌నగర్ వరకు సంజయ్…
జోగులాంబ గద్వాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి… టీఆర్ఎస్, బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలు, కారు ధ్వంసం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించిన గద్వాల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.. అసలు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను మేం అడ్డుకోలేదు.. టీఆర్ఎస్‌కు…
తెలంగాణలో వడ్ల రాజకీయం రోజుకో మలుపు తిరిగింది. చివరాఖరికి తెలంగాణ ప్రభుత్వమే వడ్లు కొనడానికి రెడీ అయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జోగులాంబ తల్లి ఏమి తప్పు చేసింది… ఇక్కడ దసరా ఉత్సవాలు అధికారికంగా ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు అమ్మ వారు అంటే భయం లేదు.. మైనార్టీ లు అంటే భయం.…
అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం? గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి..! నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్‌గా సైలెంట్.…
వాళ్లంతా గడుసు ఖాకీలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తులట. మాఫియాలతో అంటకాగడంలో వారికి మించినవాళ్లు లేరనే చర్చ డిపార్ట్‌మెంట్‌లోనే ఉందట. పైగా ఫ్రెండ్లీ పోలీస్ మాటకు కొత్త అర్థం చెబుతున్న పోలీసులపై పెద్ద బాస్‌లు కన్నేశారు. ఇంకేముందీ మళ్లీ చర్చలోకి వచ్చారు ఆ జిల్లాలోని పోలీసులు. వారెవరో.. ఎక్కడివారో ఈ స్టోరీలో చూద్దాం. గద్వాల ప్రాంతంలో ఖాకీల అవినీతిపై ఓపెన్‌గానే చర్చ! కంచే చేను మేసిన తీరుగా ఉందట గద్వాల జిల్లా పోలీసుల తీరు. నడిగడ్డ…